లోతట్టు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మండల రెవెన్యూ అధికారి విజయ శ్రీ, ఈఓ అశ్విని కుమార్
లోతట్టు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మండల రెవెన్యూ అధికారి విజయ శ్రీ, ఈవో అశ్విని కుమార్
శిరివెళ్ళ మండలంలోని ఎర్రగుంట్ల గ్రామం, ఎస్సీ మరియు బీసీ కాలనీల్లో గత రెండు రోజులుగా మోంథా తుఫాన్ ప్రభావం కారణంగా నీరు నిలిచిపోయిన ప్రాంతాలను అధికారులు పరిశీలించారు.మండల రెవెన్యూ అధికారి విజయ శ్రీ, ఈవో అశ్విని కుమార్,పర్యటన చేసి,నీరు బయటకు వెళ్లే మార్గాల కోసం జెసిపి సహాయంతో చర్యలు చేపట్టారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించే చెట్లను కూడా తొలగించారు.ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి సీనియర్ నాయకుడు మరియు ఎంపిటిసి కమతం జయరాం రెడ్డి, సచివాలయం సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ నాయకులు శీలం లక్ష్మీప్రసాద్, కమతం సుబ్బారెడ్డి మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Tags:
జాతీయం

Comments