B10వార్త

🔍

కర్నూలు జట్టు డబల్ క్రౌన్ విజేతగా ఆళ్లగడ్డ రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలు ముగింపు


కర్నూలు జట్టు డబల్ క్రౌన్ విజేతగా ఆళ్లగడ్డ రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలు ముగింపు

ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు శనివారం ముగిశాయి. అండర్-17 విభాగంలో కర్నూలు జిల్లా జట్టు బాలురు, బాలికల విభాగం రెండింటిలోనూ విజయం సాధించి డబుల్ క్రౌన్ దక్కించుకుంది.

బాలుర విభాగంలో శ్రీకాకుళం రెండవ స్థానంలో, విశాఖపట్నం మూడవ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో కడప రెండవ స్థానంలో, విజయనగరం మూడవ స్థానంలో నిలిచాయి. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఆటగాళ్లు జనవరిలో ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.

ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన 480 మంది క్రీడాకారులు, 100 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు.

Please subscribe B10👈👈👈👈👈👈

Tags: ఆటలు

Comments