B10వార్త

🔍

రైళ్లలో వారికి లోయర్ బెర్తులు- కేంద్ర మంత్రి


రైళ్లలో వారికి లోయర్ బెర్తులు: కేంద్ర మంత్రి

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(అశ్వినీ వైష్ణవ్) రాజ్యసభలో తెలిపినట్లు, రైళ్లలో వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్తులు ఆటోమేటిక్‌గా కేటాయిస్తారు

టికెట్ బుకింగ్ సమయంలో ఎంపిక చేయకపోయినా, అందుబాటు ఉంటే కింది బెర్తులు వస్తాయని మంత్రి స్పష్టం చేశారు.

స్లీపర్ బోగీల్లో కోచ్‌కు 6 నుంచి 7 లోయర్ బెర్తులు, 3ఏసీలో 4 నుంచి 5, 2ఏసీలో 3 నుంచి 4 బెర్తులు ప్రత్యేక కోటాలో రిజర్వ్ చేశారు.�దివ్యాంగులు, వారి సహాయకులకూ అలాగే ప్రత్యేక బెర్తులు కేటాయిస్తున్నారు.

స్లీపర్, 3ఏసీలో ఒక్కొక్కటికి 4 బెర్తులు (రెండు లోయర్‌తో), 2ఎస్ లేదా సీసీలో 4 సీట్లు రిజర్వ్

రైలులో లోయర్ బెర్తులు ఖాళీగా ఉంటే మిడిల్, అప్పర్ పొందిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తారు.�ఈ విధానం అమలు ద్వారా ప్రయాణికుల సౌకర్యం పెరుగుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.

గతంలోనూ ఇలాంటి కోటాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్‌తో మరింత సులభతరం అవుతోంది

Please subscribe B10👈👈👈👈👈

Tags: జాతీయం

Comments