ఆళ్లగడ్డలో తుపాను పంట నష్టంపై స్పందించిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి : రైతులకు భరోసా
ఆళ్లగడ్డలో తుఫాన్ పంటనష్టాలపై స్పందించిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి: రైతులకు భరోసా
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో మొంథ తుఫాన్ కారణంగా పంటనష్టాలు ఎదుర్కొన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తెలిపారు. మొక్కజొన్న రైతుల పంటను ప్రభుత్వ మార్క్‌ఫెడ్ కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలకే కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.
ఈవిషయాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారికి వివరించారని, తుఫాన్ తగ్గిన వెంటనే రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు...
ఇక,మాజీ ఎమ్మెల్యే గాయత్రి నగర్ ప్రాంతంలో ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించిన విషయంపై స్పందించిన జగత్ విఖ్యాత్ రెడ్డి,రెండు రోజులుగా అధికారులతో చర్చలు జరిపి నీటిని బయటకు పంపించే చర్యలు తీసుకున్నామని తెలిపారు..గత వైసీపీ ప్రభుత్వ కాలంలో గంగుల కుటుంబం చేసిన డ్రైనేజ్ పనులు అల్లకల్లోలానికి కారణమని ఆయన ఆరోపించారు.
రైతులు, ప్రజలు ఎవరు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏ సమస్య ఉన్నా తమకు లేదా అధికారులకు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి స్పష్టం చేశారు...
Please Subscribe B10👈👈👈👈👈
Tags:
జాతీయం





Comments