B10వార్త

🔍

భీమవరం తుపాను బాధితులను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు




భీమవరం తుఫాన్ బాధితులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం భీమవరం మండలం కొత్తపూసలమర్రు, దొంగపిండి ప్రాంతాల్లో తుఫాన్ వల్ల నష్టపోయిన గ్రామాలను ఈరోజు వైఎస్ఆర్సీపీ భీమవరం ఇన్‌చార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు,ఏఎస్ రాజు, కామన నాగేశ్వరరావు సందర్శించారు.  

ఉదయం మొదటగా కొత్తపూసలమర్రు గ్రామానికి వెళ్లిన వారు ఎమ్మార్వో, ఆర్డీవో అధికారులను కలిసి ప్రజల సమస్యలను వివరించారు. తుఫాన్ ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించి, పునరావాస కేంద్రాలలో ఏర్పాటు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు.  


తర్వాత కొత్తపూసలమర్రు నుంచి దొంగపిండి రోడ్డు నీటిలో మునిగిపోవడంతో బొలెరో వాహనంలో అక్కడకు చేరుకుని, పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజల యోగక్షేమాలు అడిగి దుప్పట్లు అందజేశారు. జడ్పీ హైస్కూల్‌ను కూడా పరిశీలించి ప్రజల సమస్యలను వినిపించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.  

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రూరల్ అధ్యక్షుడు జల్లా కొండయ్య, పట్టణ అధ్యక్షుడు గాధిరాజు రామరాజు, వైస్ ఎంపీపీ తిరుమాని భవాని ధనుంజయ్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Please Subscribe B10👈👈👈👈👈
Tags: రాజకీయాలు

Comments