B10వార్త

🔍

చిలకలూరిపేటలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మాజీ మంత్రి విడదల రజిని



 చిలకలూరిపేటలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన మాజీ మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాలను మాజీ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని సందర్శించారు.  
మొంథా తుఫాన్ ప్రభావంతో ముంపుకు గురైన సంజీవనగర్,తండ్రి సన్నిధి, సుగాలి కాలనీ,వీరముష్టి కాలనీ,గణపవరం శాంతినగర్, పసుమర్రు ఎస్టీ కాలనీలను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు... 
ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న ఆమె,వారికి ఆహారం మరియు తాగునీరు అందజేశారు... 

చిలకలూరిపేటలో 22 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో అనేక ప్రాంతాలు నీటమునిగాయి.  
ఇలాంటి పరిస్థితుల్లో చిలకలూరిపేటను వరద ప్రభావిత ప్రాంతంగా ప్రకటించడంతో పాటు బాధిత కుటుంబాలకు తక్షణం 
పదివేల రూపాయల చొప్పున సహాయం అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రజిని డిమాండ్ చేశారు.

Please Subscribe B10👈👈👈👈👈

Tags: రాజకీయాలు

Comments