క్రికెటర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన మార్గం, మహ్మద్ అజారుద్దీన్
క్రికెటర్ నుండి రాజకీయ నాయకుడిగా మార్గం, మహమ్మద్ అజారుద్దీన్
మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనతో రాజ్ భవన్ లోని దర్బార్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు.రేవంత్ రెడ్డి కేబినెట్ లో అజారుద్దీన్ ను చేర్చడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వ్యూహాత్మక నిర్ణయం. ఆయనకు మైనారిటీ సంక్షేమ శాఖతో పాటుగా మరో కీలక శాఖ కూడా కేటాయించే అవకాశం ఉందని ఉంది. ప్రస్తుతం కొన్ని మంత్రుల శాఖలలో మార్పులు వస్తాయని, డిసెంబరులో మరికొన్ని పదవులు ఖాళీ అయి, మంత్రివర్గంలో ప్రక్షాళన జరుగుతుందని సమాచారం.అజారుద్దీన్ మాజీ క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నేతగా, గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఓడిపోయినా, మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించే కోసం ఎమ్మెల్సీగా సిఫారసు చేయబడి, అనంతరం మంత్రిగా ప్రమాణ స్వీకారం పొందారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఆయనకు మంత్రిగా అవకాశం కల్పించడం రాజకీయంగా ముఖ్యమైన పరిణామం. కొన్ని రాజకీయ వర్గాలు దీనిపై విమర్శలు చేసినా, ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన తర్వాత ప్రమాణం జరిగింది.మొక్క ప్రశ్న అజారుద్దీన్ కి ఏ శాఖ కేటాయిస్తారు అన్నదే ఉంది. హోంసంస్థ, మైనారిటీ సంక్షేమం మరియు క్రీడల శాఖలను ఆయనకు కేటాయించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఖరారైన అధికారిక ఉత్తర్వులు త్వరలో వచ్చే అవకాశం ఉంది.
Please Subscribe B10👈👈👈👈👈

Comments