తుపాను ప్రభావంతో ఆళ్లగడ్డలో పంట నష్టం, రైతుల పరిస్థితిని పరిశీలించిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి
మొంథ తుపాన్ ప్రభావంతో ఆళ్లగడ్డలో రైతుల పంటనష్టం, పరిస్థితిని పరిశీలించిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పరిస్థితి....

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొంథ తుపాన్ ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పంటలు నీటమునిగిపోవడంతో పాటు చెరువులకు కూడా గండులు పడిన పరిస్థితిని ఆళ్లగడ్డ టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి గారు స్వయంగా అధికారులు, గ్రామస్థులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నష్టపరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు.
అలాగే గండిపడిన చెరువులను పునరుద్ధరించి ఆనకట్టలు వేయాలని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.గ్రామ నాయకులు, మండల అధికారులు ప్రజల అవసరాలను గమనించి, ఎలాంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని కోరుతూ భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి గారు సమీక్ష ముగించారు.




Comments