దువ్వూరు SVV ఫంక్షన్ హాల్‌లో "పోలీసు కళా-జాగృతి బృందం" నాటక ప్రదర్శన
దువ్వూరు ఎస్వీవీ ఫంక్షన్ హాల్లో "పోలీస్ కళా-జాగృతి బృందం" నాటక ప్రదర్శన
కడప జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం దువ్వూరు -పిఎస్ పరిధిలోని ఎస్వీవీ ఫంక్షన్ హాల్లో "పోలీస్ కళా-జాగృతి" ఇన్‌ఛార్జ్ జి.నరసరామ్ వారి టీమ్ చే ''ఓయువతా... మేలుకో'' నాటక మరియు పాటల ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈసందర్బంగా దువ్వూరు ఎస్.ఐ. వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా వుంటూ మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను నేరవేర్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలని హితువు పలికారు. మత్తు పదార్థాల ఆచూకీ తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972 కి కాల్ చేసి తెలియ జేయాలన్నారు.
దువ్వూరు పి.ఎస్.ఐ. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం వల్ల ప్రజలకు వచ్చే ఆరోగ్య సమస్యలు, సమాజంలోని రుగ్మతలు వాటివలన కలిగే అనర్ధాల గురించి వివరించారు.
అలాగే నార్కోటిక్స్ ఏ.ఎస్.ఐ. మల్లయ్య, ఈగల్ టీమ్ అయూబ్, గురుశేఖర్ లు విద్యార్దులతో "యువతా మేలుకో-మత్తు నుండి తేరుకో, డ్రగ్స్ వద్దు-జీవితం ముద్దు, మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం-భవిష్యత్తును కాపాడుకుందాం అని నినాదాలు చేయించారు.
జెడ్.పి.హెచ్.ఎస్. హెడ్ మాస్టర్ మాట్లాడుతూ నేటి సమాజంలో యువత- విద్యార్థులు "డ్రగ్స్"కు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. "పోలీసు కళా-జాగృతి బృందం" ప్రదర్శన విద్యార్థులను విశేషంగా అలరించింది.
ఈకార్యక్రమంలో కడప ఫ్యాక్షన్ జోన్ ఎస్.ఐ. సుబ్రహ్మణ్యం, కస్తూర్భ స్కూల్ అధ్యాపకులు, జెడ్.పి.హెచ్.ఎస్.స్కూల్ అధ్యాపకులు, షిర్డీ సాయి స్కూల్ అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
Please Subscribe B10👈👈👈👈👈👈





Comments