మోంతా తుఫాను బాధితులకు వైయస్ఆర్సిపి నాయకులు భరోసా ఇచ్చారు - ప్రభుత్వ సహాయం హామీ ఇచ్చారు
మోంథా తుఫాన్ బాధితులకు ధైర్యం చెప్పిన వైయస్ఆర్ సీపీ నేతలు–ప్రభుత్వ సహాయంపై హామీ
మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైయస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య,అరకు వ్యాలీ మండలం జడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి, సుడిగాలి పర్యటనలు నిర్వహించారు...
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారి ఆదేశాల మేరకు, కొత్త బల్లుగూడ, సుంకర మెట్ట, బొండం గ్రామాలలో తుఫాన్ కారణంగా ఇళ్లు కూలిపోయిన బాధితులను పరామర్శించారు.
వారిని పునరావాస కేంద్రాలకు తరలించి, ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని ప్రకటించారు...
ఏఒక్కరూ అధైర్య పడవద్దని, వైయస్ఆర్ సీపీ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలతో ఉందని అన్నారు.మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున అవసరం లేకుండా బయటకు రాకూడదని సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు స్వాభి రామ్మూర్తి, కమ్మిడి అశోక్,దురియా భాస్కరరావు, సోషల్ మీడియా ఇంచార్జ్ రామ్ తదితరులు పాల్గొన్నారు...
Please Subscribe B10👈👈👈👈👈

Comments