B10వార్త

🔍

ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి






ప్రజా ఆరోగ్యం కాపాడుకోవాలంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలి:

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలో స్థానిక రొద్దం మండల కేంద్రంలోని కోగిర, కంచి సముద్రం, కొత్తూరు, లోచర్ల గ్రామాలపరిధిలో ఉన్న వైయస్ఆర్ సీపీ నాయకులతో కలిసి ప్రతి గడపగడపకు వెళ్లి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలతో సంతకాలు చేయించారు మాజీమంత్రి, శ్రీసత్యసాయిజిల్లా వైయస్ఆర్ సీపీ జిల్లాఅధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు, మండల వైయస్ఆర్ సీపీ నాయకులు

వైద్య విద్యతో రాజకీయం చేస్తున్న కూటమి ప్రభుత్వం..

ప్రజా డబ్బుతో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించడం ప్రజాహితానికి విరుద్ధం..

స్థానిక మంత్రి సవిత మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ఆపాల్సింది పోయి, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి మెడికల్ కాలేజీను అమ్మడానికి సిద్ధమయ్యింది.




వైద్య విద్య, ప్రజారోగ్యాన్ని ప్రైవేటు పరం చేయడం కూటమి కుట్రలో భాగం..2019-2024 మధ్య వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు స్థాపించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సంకల్పం సాధారణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం..

కానీ నేడు కూటమి ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని తారుమారు చేస్తూ, ప్రజల కలల ప్రాజెక్టును ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అందిస్తోంది. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టే..ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి విభాగ అధ్యక్షులు పొగాకు రామచంద్ర గారు మరియు స్థానిక పెనుకొండ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Please Subscribe B10👈👈👈👈👈


 

Tags: రాజకీయాలు

Comments