B10వార్త

🔍

కౌలురైతులకు అన్నదాత సుఖీభవ పథకం


 

కౌలురైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఎక్కడ?

అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే అమలు చేసి కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ గుంటి అనిల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రతి కౌలు రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది రూ 20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసి గద్దెనెక్కిన తర్వాత ఆచరణలో విస్మరించారని రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వారు విమర్శించారు.కౌలు రైతులను కేంద్రప్రభుత్వం గుర్తించకపోయిన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలో ఉన్న భూమిలేని కౌలు రైతులకు ప్రత్యేకంగా సంవత్సరానికి రూ 20వేలు చొప్పున ఇస్తామని చెప్పిన విషయం కూటమి నేతలకు గుర్తు లేకపోవడం బాధాకర

మన్నారు.మొదటి దపాగా అక్టోబర్‌ నెలలో దీపావళి కానుకగా ఇస్తామని ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో రాష్ట్రప్రభుత్వం హమీ ఇచ్చిందన్నారు.అందులో బాగంగా మొదటి విడతగా రూ10వేలు కౌలు రైతుల ఖాతాలో జమ చేస్తామని వాగ్దానం చేశారని ప్రకటనలో పేర్కొన్నారు.ఈ లబ్ధి పొందడానికి కౌలురైతు గుర్తింపు కార్డు మరియు ఈ-పంటలో వారు సాగు చేస్తున్న పంటలను నమోదు చేసుకోవాలని సూచించారని తీరా దీపావళి పండగ కూడా అయిపోయిందని అన్నదాత సుఖీభవ పథకం ఎక్కడ అని కౌలురైతులు ఆవేదన చెందుతున్నారన్నారు.కౌలు రైతులపట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదని రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ద్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుండే కౌలురైతులకు సులభంగా గుర్తింపు కార్డులు జారీ చేసి 2024-2025 సంవత్సరం నుండే పెట్టుబడిసాయం ఇస్తామని ఊరూరా చెప్పి ఆ ఏడాది ఒక పైసా ఇవ్వకుండా ఎగనామం పెట్టారన్నారు.ప్రస్తుత సంవత్సరంలో సాగు చేయని భూ యజమానులకు ముందుగా ఇచ్చి వాస్తవ కౌలు రైతులకు మొండి చేయి చూపించారని ఒక ప్రకటనలో విమర్శించారు. అక్టోబర్‌లో ఇస్తామని చెప్పారని ఇప్పుడు అడిగితే ఈ-పంట నమోదు కాలేదని చెప్పటం సిగ్గుచేటని విమర్శించారు. ఈ- పంట నమోదు ఎందుకు చేయలేదని, జాప్యం ఎందుకు జరుగుతున్నదని దీనికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. ఈ నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు లేనట్లే అర్థమవుతుందని,ఖరీఫ్‌ సీజన్‌ దాటిపోయి రబీ సీజన్‌ ప్రారంభమైందని ఈ సమయంలోనే కౌలురైతులకు పెట్టుబడి అవసరం అవుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి కౌలురైతుల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీనమేషాలు లెక్కపెట్టకుండా భూమి లేని కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద రూ॥ 20 వేలు పెట్టుబడి సాయాన్ని తక్షణమే అందించి ఆదుకోవాలని ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ సెక్రెటరీ గగుంటి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.

Tags: జాతీయం

Comments