B10వార్త

🔍

ఏసీబీ వలలో డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు



 


ఏసీబీ వలలో డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు

డోన్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఓ రైతు పొలం సమస్య పరిష్కారానికి డోన్ డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసి దాడి చేశారు. లంచం తీసుకుంటుండగా సునీల్ రాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Please Subscribe B10👈👈👈👈👈

Tags: జాతీయం

Comments