తాగునీటి పథకం మరమ్మతుల కారణంగా అహోబిలం పుణ్యక్షేత్రంలో నీరు నిలిచిపోయింది.
అహోబిలం పుణ్యక్షేత్రంలో మంచినీటి పథకం మరమ్మతుల కారణంగా నీటి కటకటి
ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలం గ్రామంలో తాగునీటి కొరతతో ప్రజలు తీవ్రఇబ్బందుల్లో పడుతున్నారు.స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఉన్న రక్షితమంచినీటి పథకం మరమ్మతులకు గురికావడంతో గతనాలుగు రోజులుగా నీరు అందడం నిలిచింది,ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లి మోటార్ సైకిల్, సైకిళ్లకు బిందెలుకట్టి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. పుణ్యక్షేత్రంగా పేరొందిన ఈ ప్రాంతానికి వేలాది యాత్రికులు ప్రతిరోజూ వస్తుండగా, నీటిసమస్య కారణంగా అందరికి భాదకరంగా మారింది.పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమస్య పరిష్కారం కనిపించకపోవడంతో ప్రజల్లో అసంతృప్టి నెలకొంది.తక్షణ స్పందనగా అధికారులు గ్రామంలో నీటి సమస్యను తొలగించే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు...
Please Subscribe B10👈👈👈👈👈
Tags:
జాతీయం


Comments