అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
అమరావతిలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో భేటీ,నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ,శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రతిమ అందజేత
సోమవారం రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి పనులు మరియు ప్రజల సమస్యలు వివరించగా, ముఖ్యమంత్రి వారి పూర్తి సహకారం అందిస్తానని హామీ చేశారు.అలాగే, ఆళ్లగడ్డ శిల్పకారుల చేత రూపొందించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రతిమను సీఎం కు అందజేశారు. ఆళ్లగడ్డ శిల్పకారుల ప్రతిభను చూసి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.ఎమెల్యే భూమా అఖిలప్రియ అహోబిలం నరసింహస్వామి ఆలయాన్ని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి తీసుకుంటున్న చర్యల విషయాన్ని కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ ఏర్పాట్లు నియోజకవర్గ అభివృద్ధికి మాలికలుగా నిలుస్తాయని భావిస్తున్నారు.
Please Subscribe B10👈👈👈👈👈
Tags:
రాజకీయాలు



Comments