వరద నీటి ప్రవాహం వల్ల కోతకు గురైన డిజిపి కాలువ టిజిపి చైర్మన్ చెన్నారెడ్డి గారు సంజీవ కుమార్ రెడ్డి పరిశీలించారు
వరద నీటి ప్రవాహానికి కోతకు గురైన డిజిపి కాలువ.
పరిశీలించిన టీ జి పి చైర్మన్ చెన్నా రెడ్డి గారి సంజీవ కుమార్ రెడ్డి
శిరివెళ్ల : ఇటీవల కురిసిన మోంత తుఫాను కారణంగా వరద నీరు తెలుగుగంగ ప్రధాన కాలువలో ఉదృతంగా ప్రవహించడం వల్ల పలుచోట్ల ప్రధాన కాలువ కోతకు గురైందని తెలుగుగంగ ఆయకట్టు రైతన్నలు టి జి పి ప్రాజెక్టు చైర్మన్ చేన్నారెడ్డి గారి సంజీవ కుమార్ రెడ్డికి మరియు తెలుగు గంగా అధికారులకు వివరించారు. రైతుల సూచన మేరకు టీజీపీ చైర్మన్ సంజీవ కుమార్ రెడ్డి తెలుగుగంగ అధికారులు మరియు రైతులు నీటి కోతకు గురై కొన్ని చోట్ల గండి పడే ప్రమాదాలు నెలకొని ఉన్న కాలువ కట్టను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తెలుగుగంగ ప్రధాన కాలువ 34.400 నెంబర్ రాయి కిలోమీటర్ వద్ద వరద నీటి కోతకు గురైన ప్రధాన కాలువ కట్టలను టీ జి పి చైర్మన్ పరిశీలించారు. వరి పొట్ట దశ చివరి దశలో ఉన్నందున నీటి ఎద్దడి ఎదురైతే రైతన్నలు తీవ్రంగా నష్టపోతారని చేతికొచ్చిన పంట నోటి దాకా వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం అధికారులపై ఎంతైనా ఉందని తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్ చెన్నారెడ్డి గారి సంజీవ కుమార్ రెడ్డి టి జి పి అధికారులకు తెలియజేశారు. వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టి రైతులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా తగిన పనులు చేపట్టాలని చైర్మన్ ఆదేశించారు. తెలుగంగ ప్రధాన కాలువతో పాటు ఉప కాలువలలో సైతం అధిక నీటి ప్రవాహానికి కాలువలు బలహీనమై పలుచోట్ల గండి పడే ప్రమాదం ఉన్నదని అన్నారు. రుద్రవరం మండలం చిలకలూరు గ్రామ పరిధిలో 19వ బ్లాక్ ఉప కాలువ బలహీనమై గండ్లు పడే ప్రమాదం ఉందని తెలుగు గంగ కట్టను మరమ్మతులు చేసి కట్టపై ఉన్నటువంటి ముళ్ళ కంపను చెట్లను తొలగించాలని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన తెలుగుగంగ కాలువతోపాటు ఉపకాలువలు లాకులు, షెటర్లు తదితర వాటి పనితీరు పరిశీలించి రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఆటంకం ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్త వహించాలని టీజీపీ చైర్మన్ చెన్నారెడ్డి గారి సంజీవ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Please Subscribe B10👈👈👈👈👈

Comments