దువ్వూరు నుంచి ప్రొద్దుటూరు వెళ్లే రోడ్డులో సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడింది

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం దువ్వూరు టు ప్రొద్దుటూరు వెళ్లే రోడ్డులో సిమెంటు లోడుతో వెళుతున్న ట్యాంకర్ బోల్తా..
వివరాల్లోకి వెళితే దువ్వూరు వైపు నుండి ప్రొద్దుటూరు వైపు వెళుతున్న ఓ సిమెంట్ లోడు టాంకర్ సరిగ్గా నేలటూరు మెట్ట రాధానగర్ కు మధ్యలో ప్రమాదకరమైన మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడడం జరిగింది,అయితే నెలటూరు మెట్ట రాధానగర్ మధ్యలో ఓ అమాంతమైన మలుపు ఉన్నది,ఆ మలుపువద గతంలో కూడా చాలా వాహనాలు అదుపుతప్పి బోల్తాపడడం జరిగింది . అయితే ఈరోజు అనగా... 02-11-2025 వ తేదీన ఆదివారం, తెల్లవారుజామున ఓ సిమెంట్ లోడుతో దువ్వూరు వైపు నుండి ప్రొద్దుటూరు వైపు వెళుతున్న ట్యాంకర్,సరిగ్గా అదే మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడటం జరిగింది...
Please Subscribe B10👈👈👈👈👈
Tags:
జాతీయం



Comments