జనసేన పార్టీ కార్యక్రమంలో దొర్నిపాడు క్రియాశీలకుడు జమ్మి చిట్టిబాబు కుటుంబానికి-5 లక్షలు ఆర్థిక సాయం
జనసేన పార్టీ కార్యక్రమంలో దొర్నిపాడు క్రియాశీలకుడు జమ్మి చిట్టిబాబు కుటుంబానికి,5 లక్షల ఆర్థిక సాయంఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం W.గోవిందిన్నె గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త జమ్మి చిట్టిబాబు ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించాడు.
తాడేపల్లి అన్నపూర్ణ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిట్టిబాబు కుటుంబానికి జనసేన పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చెక్కును రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & MLC కొణిదెల నాగబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాష్ట్ర MSME చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ అందజేశారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాలలో మరణించిన 220 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున మొత్తం 11 కోట్ల రూపాయల తగ్గిన చెక్కులను జనసేన పార్టీ పంపిణీ చేసింది.
ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో ఆళ్లగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త మైలేరి మల్లయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిట్టిబాబు తల్లి వెంకట లక్ష్మి మాట్లాడుతూ—మన కుటుంబానికి పూర్తి భరోసా, ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీకి, ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఊమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు, ఆళ్లగడ్డ జనసేన ఐటీ కోఆర్డినేటర్ మామిళ్ళ సుధాకర, వాలంటరీ సంకటి మద్దిలేటి యాదవ్‌కు కూడా ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.జనసేన భీమా పథకం ద్వారా కార్యకర్తలకు ధీమా కల్పించడమే లక్ష్యమని, ఈ తరహా చర్యలతో కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పార్టీ కార్యకలాపాలలో పాల్గొనాలని పార్టీ నేతలు ఆకాంక్షించారు.
Please subscribe B10👈👈👈👈👈

Comments