B10వార్త

🔍

మహిళా క్రికెట్‌లో కడప ఎర్రమలపల్లి శ్రీచరణి ఘన విజయం



 




కడప ఎర్రమలపల్లి శ్రీచరణి మహిళా క్రికెట్‌లో ఘన విజయం: గ్రామస్థాయి నుండి దేశస్తాయి ప్రతిభ

భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఉమెన్స్ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగుతేజం శ్రీచరణి కి అభినందనలు. ప్రత్యర్థులకు పదునైన బంతులతో చుక్కలు చూపించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణి మన తెలుగుమ్మాయి కావడం మనందరికీ గర్వకారణం. వరల్డ్ కప్ లో 9 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచిన శ్రీచరణి కి అభినందనలు. వరల్డ్ కప్ గెలిచిన అనంతరం తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన శ్రి చరణి గారికి సహచర మంత్రులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి , శ్రీమతి సవిత, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి శ్రీ సానా సతీష్, టీమిండియా మాజీ కెప్టెన్ శ్రీ మిథాలీరాజ్ గారితో కలిసి గన్నవరం ఎయిర్ పోర్టులో స్వాగతం పలకడం జరిగింది. భావి భారత బాలికలకు కలలు కనే ధైర్యాన్నిచ్చిన విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణి మున్ముందు మరిన్ని విజయాలతో ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి వెళ్లాలని మనసారా కోరుకుంటున్నా.

Please Subscribe B10👈👈👈👈👈👈
Tags: రాజకీయాలు

Comments