B10వార్త

🔍

రెండు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న శ్రీమతి నారా భువనేశ్వరికి ఏపీ హోం మంత్రి అభినందనలు


రెండు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న శ్రీమతి నారా భువనేశ్వరి కి శుభాకాంక్షలు తెలిపిన AP హోం మంత్రి

సమాజానికి మంచి చేయడంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని, నాయకత్వ పటిమలో భర్త గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతను అందిపుచ్చుకుని రెండు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న శ్రీమతి నారా భువనేశ్వరి గారికి హృదయపూర్వక అభినందనలు.

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సమాజ సేవలో మీరు చూపిస్తున్న అచంచలమైన నిబద్ధతకు గుర్తింపుగా “ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్” విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు, నైతిక విలువలతో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ – 2025 అవార్డులను అందుకోవడం ప్రతి తెలుగువారికి గర్వకారణం.

లండన్‌లోని మే ఫెయిర్ హాల్‌లో జరిగిన వేడుకలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు.

స్వర్గీయ ఎన్టీఆర్ గారి వారసురాలిగా ఇంత గౌరవప్రదమైన అవార్డులు అందుకోవడం ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు మరియు ప్రతి తెలుగువారికి గర్వకారణం. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే భువనమ్మ గారు ఎల్లప్పుడూ మాకు మార్గదర్శకులు. ఈ విజయానికి నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను.

Please Subscribe B10👈👈👈👈👈👈

 

Tags: రాజకీయాలు

Comments