B10వార్త

🔍

వరి పంటపై ఉల్లిపాయ పురుగు దాడి


గోరుచుట్టు పై రోకలి పోటులా రైతు పరిస్థితి..

శిరివెళ్ల మండల పరిధిలోని గంగవరం గ్రామంలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. వరి పంటపై ఉల్లికోడు వైరస్ పంజా విసిరింది. పెట్టిన పెట్టుబడి నెత్తికి వచ్చే పరిస్థితి. ఎదురవుతున్నదని రైతన్నలు విలవిల్లాడుతున్నారు. సొంత భూమి గల రైతులు పెట్టుబడి వస్తుందా రాదా అనే పరిస్థితి ఉంటే కౌలు రైతు పరిస్థితి ఢీనాతి దీనంగా మారింది. ఉల్లికోడు దెబ్బకు దిగుబడులు తగ్గి పెట్టుబడులు నెత్తికొచ్చే పరిస్థితి ఎదురవుతున్నదని శిరివెళ్ల మండలం గంగవరం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గంగవరంగ్రామంలో అత్యధికంగా వరిసాగు చేశారు.విత్తనం వడ్ల నుంచి నారపోసి నీరు పెట్టి నాటు వేసి పెట్టుబడి పెట్టి పంట చేతికి అందే దశలో ఉల్లికోడు రైతన్నల పాలిట పెను శాపంగా మారిందని వరి రైతులు పేర్కొంటున్నారు. గంగవరం గ్రామానికి చెందిన తెలుగు శివుడు సుమారు 7 ఎకరాల్లో వరి సాగు చేపట్టగా పొలం అంతా ఉల్లి కోడు వ్యాపించింది. దిగుబడులు సగానికి సగం తగ్గే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన మొంత తుఫాను ఒకవైపు ఉల్లికోడు మరోవైపు అధిక పెట్టుబడులు పెట్టి కష్టాల్లో ఉన్న అన్నదాతలకు గోరుచుట్టు పై రోకలి పోటులా మారిందని అంటున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతన్నలు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు.

Please Subscribe B10👈👈👈👈👈

 

Tags: జాతీయం

Comments