B10వార్త

🔍

ఆళ్లగడ్డ విద్యుత్ శాఖ నూతన డి.ఈ.ఈ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు.....


 


ఆళ్లగడ్డలో రైతులు వినియోగదారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా..

ఆళ్లగడ్డ విద్యుత్ శాఖ సబ్ డివిజన్ పరిధిలో రైతులకు, విద్యుత్తు వినియోగదారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆళ్లగడ్డ విద్యుత్ శాఖ DEE శ్రీనివాసులు తెలిపారు. నూతన DEE గా ఆయన గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ సబ్ డివిజన్ లోని 6 మండలాల పరిధిలో విద్యుత్ శాఖకు సంబంధించి ఏ సమస్య ఉన్న పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూక నరసింహారెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు నూతన డిఇఇ కి ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు.

Tags: జాతీయం

Comments