నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడమే మా లక్ష్యం రాయలసీమ డిఫెన్స్ అకాడమీ
నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడమే మాలక్ష్యం: రాయలసీమ డిఫెన్స్ అకాడమీ
నిరుద్యోగులకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాయలసీమ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆళ్లగడ్డ పట్టణంలోని అంకాల్రెడ్డి డిగ్రీ కాలేజీ ఆవరణంలో ఏర్పాటు చేసిన రాయలసీమ డిఫెన్స్ అకాడమీ ప్రాంగణంలో నిరుద్యోగులకు విద్యార్థులకు డిఫెన్స్ శాఖలలో ఉండే ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ అకాడమీ వ్యవస్థాపకులు ఎం సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని 6 మండలాలలో గల విద్యార్థులకు నిరుద్యోగులకు డిఫెన్స్ శాఖలలో ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో రాయలసీమ అకాడమీ ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అందుకోసం ఆర్మీలో ఎంతో అనుభవం కలిగి పదవీ విరమణ పొందిన ఎం శ్రీనివాసులు, పి చెన్నయ్య, దేవేంద్ర నాథ్ రెడ్డి, రామసుబ్బయ్య గార్లతో పాటు తన విశేష ప్రతిభతో ఎందరో విద్యార్థులకు క్రీడలలో మంచి తఫర్ఫీదును అందిస్తున్న ఆర్ఆర్ అకాడమీ కోచ్ సుబ్బరాయుడు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండడం ఎంతో గర్వ కారణం అని తెలిపారు. డిఫెన్స్ శాఖలలో ఉద్యోగాలు పొందిన వారు పదవీ విరమణ తర్వాత కూడా మన ప్రాంతంలో తిరిగి ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందని కావున యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రామలింగారెడ్డికి మరియు అకాడమీ వ్యవస్థాపకులు సుబ్బారెడ్డికి ఘనంగా పూలమాలలతో దుశ్శాలవాలతో సత్కరించారు. కార్యక్రమంలో పలువురు పుర ప్రముఖులతో పాటు విద్యార్థులు నిరుద్యోగులు పాల్గొన్నారు.
Please Subscribe B10👈👈👈👈👈




Comments