ఎగువ, దిగువ అహోబిలం ఆలయాల్లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎగువ,దిగువ అహోబిలం పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక పూజలు
ఆళ్లగడ్డ మండలంలోని ఎగువ, దిగువ అహోబిలం పుణ్యక్షేత్రాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదివారం సందర్శించి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి, వేద పండితుల బృందం ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ ప్రహ్లాద వరదస్వామి వారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీ అమృతవల్లి అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. రంగనాయక మంటపంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Please Subscribe B10👈👈👈👈👈
Tags:
రాజకీయాలు









Comments