కడపలో ఆళ్లగడ్డ వాసి చిరంజీవికి బ్లడ్ వారియర్ అవార్డు
కడపలో ఆళ్లగడ్డ వాసి చిరంజీవికిబ్లడ్ వారియర్ అవార్డు
కడప పట్టణంలో ఖూన్ కా రిస్తా చారిటబుల్ ట్రస్ట్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ (Allagadda) వాసి చిరంజీవికి బ్లడ్ వారియర్ అవార్డు ప్రదానం చేశారు.
రక్తదానంలో అసాధారణ సేవలు అందించిన రక్తదాతలు, స్వచ్ఛంద సేవకులకు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఛత్రపతి శంభాజీ సేవాదళ్ ప్యాపీలి చిరంజీవి గారిని ప్రత్యేకంగా సత్కరించారు.నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ, పరిస్థితి గ్రామాల్లో అత్యవసర సమయాల్లో రక్తదాతలను సమన్వయం చేసి అనేక మందికి ప్రాణదానం చేసిన సేవలకు ఈ సత్కారం.
ట్రస్ట్ నిర్వాహకులు ఆయన నిబద్ధత, సమయానికి రక్తం అందించిన కృషిని ప్రశంసించారు.చిరంజీవి మాట్లాడుతూ, “రక్తదానం మహాదానం. నువ్వు చేసే రక్తం మరొకరికి ప్రాణదానం. ప్రతి ఆరోగ్యవంతుడు మూడు నెలలకు ఒకసారి దానం చేయాలి. ఇదే నిజమైన మానవత్వం” అని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు,వైద్యులు,రక్తదాతలు,స్థానికులు పాల్గొని అభినందాలు తెలిపారు.
Please subscribe B10👈👈👈👈👈

Comments