B10వార్త

🔍

పెళ్లి ముగిసేలోపే కాపురానికి ముగింపు



 24 గంటల్లోనే విడాకులకు కోర్టు మెట్లెక్కిన జంట 

పూణేలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కేవలం 24 గంటలకే ఓ నూతన దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. పెళ్లైన వెంటనే కాపురం ఎలా ఉండాలి, భవిష్యత్ జీవన విధానం ఏంటి అనే అంశాలపై తీవ్ర విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

ఇద్దరి మధ్య ముందే చర్చించుకోని విషయాలు పెళ్లి తర్వాత బయటపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరస్పర అవగాహన కుదరకపోవడంతో కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న జంట, పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది.

ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. పెళ్లికి ముందు సరైన అవగాహన, ఆలోచనల సరితూగుదల ఎంత ముఖ్యమో మరోసారి ఈ సంఘటన స్పష్టం చేస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Please subscribe B10👈👈👈👈👈👈

Tags: జాతీయం

Comments