B10వార్త

🔍

నిర్మల్ లో 15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మండల సర్వేయర్ ఎన్ బాలకృష్ణ వర్మ



నిర్మల్‌లో లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ ACB వలకు చిక్కాడు.

ఫిర్యాదుదారు బంధువు భూమి సర్వే పనులకు రూ.15,000 డిమాండ్ చేసిన ఎన్.బాలకృష్ణవర్మ పట్టుబడ్డాడు. 

గ్రామీణ మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఈ సర్వేయర్, ఇప్పటికే రూ.5,000 తీసుకుని మిగిలిన రూ.7,500ను ప్రైవేట్ సహాయకుడు పోల నాగరాజు ద్వారా వసూలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ACB అధికారులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

ప్రభుత్వ సేవలకు లంచం అడిగితే ప్రజలు భయపడకుండా టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ACB సూచించింది...

ఇలాంటి సంఘటనలు తగ్గించడానికి ప్రజల సహకారం అవసరమని అధికారులు పేర్కొన్నారు...

Please subscribe B10👈👈👈👈👈👈

Tags: జాతీయం

Comments