B10వార్త

🔍

పెద్ద కొట్టాలలో ఘనంగా అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు


పెద్ద కొట్టాలలో ఘనంగా అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

పెద్ద కొట్టాల గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి ఘనంగా జరిగింది.

అంగన్వాడి కేంద్రం ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

వికలాంగుల ఆదరణ సేవా సమితి వ్యవస్థాపకులు జజ్జారి మరియదాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పరదేశి రోజఅక్క, రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బెల్లం రాజకుమార్ కూడా పాల్గొన్నారు.

పాణ్యం నియోజకవర్గ వికలాంగుల అధ్యక్షులు గజ్జల శీల, శ్రీపతి ఆశీర్వాదం, మాజీ సర్పంచి మద్దిలేటి తదితరులు ఆంబేద్కర్ గారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆశాజ్యోతి పాత్రను కొనియాడారు.

Please subscribe B10👈👈👈👈👈
 

Tags: జాతీయం

Comments