B10వార్త

🔍

జూమ్‌కు ఆర్‌అండ్‌డీ, జీసీసీ కోసం ఏపీ ఆహ్వానం


జూమ్‌కు ఆర్‌అండ్‌డీ, జీసీసీ కోసం ఏపీ ఆహ్వానం

జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ బావా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌తో సమావేశం అయ్యారు.

ఈ భేటీలో రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులు, టెక్నాలజీ రంగ విస్తరణపై చర్చించారు.అమరావతి లేదా విశాఖపట్నంలో జూమ్ సంస్థ ఆర్‌అండ్‌డీ/ఇంజనీరింగ్ డెవలప్‌మెంట్ సెంటర్, అలాగే విశాఖపట్నంలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని జూమ్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

దీనిపై ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం, అనుకూల వాతావరణం కల్పిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Please subscribe B10👈👈👈👈👈👈

Tags: అంతర్జాతీయం

Comments