11 మొబైల్‌లతో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
B10వార్త:యర్రగుంట్ల రైల్వే పోలీస్ పరిధిలో వరుస మొబైల్ దొంగతనాలపై ఖచ్చిత సమాచారంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. 19 జనవరి 2026 సాయంత్రం 4.30 గంటలకు స్టేషన్ ప్లాట్‌ఫారం-1 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో అనుమానాస్పద ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.అరెస్ట్ అయిన చుక్కా నాగ గోపీచంద్ (35, తెనాలి గుంటూరు), యర్రంరెడ్డి వెంకటసుబ్బయ్య (33, నెల్లూరు)ల వద్ద 11 మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.� వీరు యర్రగుంట్ల, తిరుపతి, గుత్తి స్టేషన్లలో ప్రయాణికుల మొబైల్‌లు దొంగిలిస్తూ అమ్ముకుని జీవిస్తున్నట్టు ఒప్పుకున్నారు.DSP హర్షిత, IRP M. సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో RPS, ఐటి కోర్ టీం దర్యాప్తు చేసి దొంగలను బందీ చేశారు. ప్రయాణికులు వస్తువులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.
Please subscribe B10👈👈👈👈👈👈
Tags:
జాతీయం

Comments