B10వార్త

🔍

చాగలమర్రి టోల్ ప్లాజాలో రహదారి భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించిన - ఆళ్లగడ్డ అర్బన్ సీఐ యుగంధర్



నంద్యాల జిల్లా చాగలమర్రి టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి భద్రతా మాసంలో భాగంగా తెల్లవారుజామున అవగాహన కార్యక్రమం జరిగింది.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ లిమిటెడ్ (REPL), పోలీసు శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ అర్బన్ సీఐ యుగంధర్, చాగలమర్రి ఎస్సై సురేష్ నాయుడు పాల్గొన్నారు.వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు, మద్యం సేవించి డ్రైవింగ్ ప్రమాదాలు, నిద్రమత్తు నివారణకు ముఖం కడుక్కోవాలని సూచనలు చేశారు.

సీటు బెల్ట్, అతివేగ నియంత్రణపై అవగాహన కల్పించి, 37వ రహదారి భద్రతా వారోత్సవాల బ్యానర్లు ప్రదర్శించారు.

సీఐ యుగంధర్ మాట్లాడుతూ, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా తనిఖీలు చేస్తున్నామని, అందరూ బాధ్యతగా వాహనాలు నడపాలని కోరారు...

Please subscribe B10👈👈👈👈👈

Tags: జాతీయం

Comments