B10వార్త

🔍

ఆళ్లగడ్డ నూతన సీఐగా నాగరాజు రావు


నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) గా నాగరాజు రావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు స్థానిక ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. లాంఛనంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నూతన సీఐ నాగరాజు రావు మీడియాతో మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణే తన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, బాధితులు ఎవరైనా నిర్భయంగా స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మట్కా, గుట్కా, పేకాట తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అసాంఘిక శక్తులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నేర రహిత సమాజ నిర్మాణంలో, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని సీఐ నాగరాజు రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...

Please subscribe B10news👈👈👈👈👈

 

Tags: జాతీయం

Comments