ఆళ్లగడ్డలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 15 (B10వార్త): ప్రపంచ దేశాలు కీర్తించే అత్యుత్తమ ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రచించి, ప్రతి భారతీయునికీ సమాన హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కే దక్కుతుందని పలు దళిత, బహుజన, ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు. మంగళవారం బాబా సాహెబ్ 135వ జయంతిని పురస్కరించుకుని ఆళ్లగడ్డలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక ఎం.ఆర్.ఓ. కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నాయకులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు దళిత, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రతి భారతీయుడి ఆత్మీయుడని కీర్తించారు. దేశంలో ప్రస్తుతం మతం, కులం పేరుతో జరుగుతున్న అరాచకాలపై ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని, దేశ సంపద కేవలం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు ఏకమై, ఒక మహోత్తర పోరాటానికి శ్రీకారం చుట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ విజిలెన్స్ కమిటీ మెంబర్ అన్నమ్మ, లెక్చరర్ గంగన్న, దళిత సంఘాల నాయకులు దశమి ప్రసాద్, కేపీ ఓబులేసు, జేఏసీ నాయకులు బీరువాల బాషా, న్యాయవాదులు చింతల ఓబుళమ్మ, పంబ సునీల్, రాజు, గౌస్, టీచర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, దళిత, ప్రజా సంఘాల నేతలు నేరెళ్ల కళ్యాణ్, వరికుటి హన్నమ్మ, నెగల జానీ, కుందవరం మునయ్య, ఎద్దుల సుదీర్ పాల్, డాక్టర్ వెస్లీ, మరిదాస్, ముక్తార్ బాషా, ఫక్రుద్దీన్, లక్ష్మీపతి, పెన్నాం సుధాకర్, మేకల సుధాకర్, డాలు రత్నమయ్య, రాజారావు, నెగల యేసు, సీపీఐ భాస్కర్, మన్యం ప్రసాదు, ఫోటో శేఖర్ శాస్త్రి తదితరులు విశేష సంఖ్యలో హాజరయ్యారు...
Tags:
జాతీయం


Comments