B10వార్త

🔍

మహిళా సాధికారతకు 'రిజర్వేషన్ బిల్లు' ఓ కీలక మైలురాయి: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ



న్యూఢిల్లీ: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన చారిత్రాత్మక నేపథ్యంలో, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన సహచర ఎమ్మెల్యేలు, టీడీపీ పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చట్టసభల్లో మరియు రాజకీయాల్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించే దిశగా తీసుకువచ్చిన ఈ బిల్లు దేశ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ఇలాంటి చారిత్రాత్మక తరుణంలో లోక్‌సభ స్పీకర్‌తో సమావేశమై, ఈ ఘట్టంలో భాగస్వామ్యం అవ్వడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. స్పీకర్ ఓం బిర్లాతో జరిగిన ఈ భేటీలో మహిళా బిల్లుకు సంబంధించిన పలు కీలక అంశాలపై వారి బృందం సవివరంగా చర్చించింది. ఈ బిల్లు ద్వారా దేశంలో మహిళల సాధికారతకు, రాజకీయ ఎదుగుదలకు కొత్త దారులు తెరుచుకుంటాయనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే అఖిలప్రియ ఈ సందర్భంగా వ్యక్తపరిచారు...

Please subscribe B10news👈👈👈👈👈
 

Tags: రాజకీయాలు

Comments