నా పొలం నాకు ఇప్పించి న్యాయం చేయండి
చాగలమర్రి ఏప్రిల్ 27,
నా భర్త నుండి నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితురాలు చీకటి శేషమ్మ అధికారులను కోరారు. సోమవారం మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ వర్గం రాయలసీమ అధ్యక్షుడు నేగల యేసు, రాష్ట్ర అధ్యక్షురాలు పాల సుజాత, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సాగర్, రాష్ట్ర సెక్రెటరీ చిన్న రాయుడు, నాగేష్, రత్నము లతో కలిసి స్థానిక ఎం ఆర్ ఓ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మాలల అభివృద్ధి సంఘం రాయలసీమ అధ్యక్షులు నేగల యేసు, రాష్ట్ర అధ్యక్షురాలు పాల సుజాత లు మాట్లాడుతూ చాగలమర్రి మండల పరిధిలోని గొడుగునూరు గ్రామానికి చెందిన చిక్కటి శేషమ్మ పొలము ఒక ఎకరా గొడిగనూరు పొలిమేర లొ సర్వే నంబర్ 201, సెట్టివీడు పొలిమేర సర్వే నంబర్ 98 లో ఒక ఎకరా యాభై సెంట్లు పొలమును శేషమ్మ బావ తప్పుడు పత్రాలతో ఆన్లైన్ చేసుకోవడం జరిగిందన్నారు. సంబంధిత అధికారులు శేషమ్మ బావ ఆక్రమించుకున్న పొలంపై విచారణ జరిపి శేషమ్మ పొలమును ఆమెకు ఇప్పించి న్యాయం చేయాలన్నారు. ఆమె పొలం చట్టపరంగా ఆమెకు దక్కేవరకు న్యాయపోరాటం చేస్తామని వారు హెచ్చరించారు......


Comments