B10వార్త

🔍

రుద్రవరం పీహెచ్సీలో డాక్టర్ కరవు.. రోగుల అవస్థలు..గాలికి ప్రభుత్వ వైద్యం:


నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు బాగా దెబ్బతిన్నాయి. పీహెచ్సీలో విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు...

సమాచారం ప్రకారం, ఆమె నెలలో కేవలం ఆరు లేదా ఏడు సార్లు మాత్రమే ఆస్పత్రికి వచ్చి, రిజిస్టర్లలో ఒకేసారి సంతకాలు చేస్తారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని కారణంగా పీహెచ్సీ పరిధిలో రోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...

ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆస్పత్రిలో డాక్టర్ లేకపోవడంతో బాధితులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.స్టాఫ్ నర్సులే చికిత్సలు నిర్వహించే పరిస్థితి రావడం వల్ల వైద్య సేవల నాణ్యత దెబ్బతినడమే కాకుండా, రోగుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...

కాల్‌డ్యూటీలు నిర్వర్తించకపోవడం, సమయపాలన పాటించకపోవడం వల్ల ప్రభుత్వ వైద్య రంగంపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రభుత్వం నుంచి భారీ వేతనాలు తీసుకుంటూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు...

బయోమెట్రిక్ హాజరు యంత్రం డాక్టర్ నియంత్రణలో ఉండటంతో ఇంటి నుంచే హాజరు వేసుకునే పరిస్థితి కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.పైస్థాయి అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని రుద్రవరం పీహెచ్సీలో పరిస్థితిని సరిదిద్దాలని, ప్రజలకు సరైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
 

Please subscribe B10news👈👈👈

Tags: ఆరోగ్యం

Comments