సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లె నాయకులు రవిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ టీడీపీ యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొని, గ్రామానికి చెందిన లబ్ధిదారులు పండ్ల వెంకటమోహన్, దూదేకుల కాశిం పీరా, దూదేకుల హుస్సేనమ్మ, గొల్లల వెంకటలక్ష్మి లకు ఈ చెక్కులను స్వయంగా అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. సకాలంలో తమకు ఆర్థిక సహాయం అందజేసిన ప్రభుత్వానికి, మరియు సహకరించిన నాయకులకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు....
Please subscribe B10news👈👈👈👈👈👈
Tags:
రాజకీయాలు




Comments