గోవిందపల్లె ప్రీమియర్ క్రికెట్ లీగ్' టోర్నమెంట్ ను,టాస్ వేసి ప్రారంభించిన టీడీపీ నేత గంగదాసరి రవిచంద్రా రెడ్డి.....
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లెలో క్రికెట్ సందడి మొదలైంది. స్థానిక యువత ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'గోవిందపల్లె ప్రీమియర్ లీగ్' ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది...
ఈ క్రీడా సంబరాలకు ముఖ్యఅతిథిగా గోవిందపల్లె టీడీపీ నాయకులు గంగదాసరి రవిచంద్రా రెడ్డి విచ్చేశారు. పిచ్‌పై కాయిన్ టాస్ వేసి టోర్నమెంట్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు...
అనంతరం అక్కడే ఉండి తొలి మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షించి, క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. నంద్యాల జిల్లా వాసుల కోసం ప్రత్యేకంగా గోవిందపల్లె స్కూల్ గ్రౌండ్ వేదికగా టెన్నిస్ బాల్‌తో, 10 ఓవర్ల నాకౌట్ పద్ధతిలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు....
ఈ టోర్నమెంట్‌కు జిల్లా క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఏకంగా 53 జట్లు ఈ పోటీల్లో తలపడేందుకు తరలిరావడంతో గ్రౌండ్ అంతా క్రీడాకారులతో కోలాహలంగా మారింది. హోరాహోరీగా సాగనున్న ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించారు. ప్రథమ బహుమతిగా 50 వేలు, ద్వితీయ బహుమతిగా 25 వేలు, తృతీయ బహుమతిగా 10 వేల రూపాయలను అందజేయనున్నారు. పక్కా నిబంధనలతో, క్రీడా స్ఫూర్తితో సాగుతున్న ఈ టోర్నీ స్థానిక క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది....
Please subscribe B10news👈👈👈👈👈👈



Comments