అన్నదాత సీడ్స్ ఆధ్వర్యంలో 600 మంది రైతులతో విజయవంతంగా ముగిసిన 'NK ఉడాన్' సదస్సు
నరసాపురంలో సింజెంటా ఆధ్వర్యంలో ‘ఎన్‌కే ఉడాన్’ రైతు అవగాహన సదస్సు....
రుద్రవరం మండలం నరసాపురం గ్రామంలో సింజెంటా సంస్థ ఆధ్వర్యంలో ‘ఎన్‌కే ఉడాన్’ రైతు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు..వానాకాలం సీజన్‌లో మొక్కజొన్న సాగు చేసే రైతులకు మార్గదర్శకంగా
ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలైన సుమారు 20 గ్రామాల నుంచి 500 మందికి పైగా రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సింజెంటా ఏపీ బిజినెస్ మేనేజర్ వీరమాచినేని రామ్ భూపాల్ మాట్లాడుతూ ‘ఎన్‌కే 6802’ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం ప్రత్యేకతలను వివరించారు. 120 రోజుల పంటకాలం కలిగిన ఈ విత్తనం బలమైన ఈదురు గాలులు, ప్రతికూల వాతా వరణ పరిస్థితులు, నీటి ఎద్దడి, వివిధ తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుని అధిక దిగుబడిని ఇస్తుందని తెలిపారు. గత రెండేళ్లుగా ఈ విత్తనం రైతులకు మంచి లాభాలను అందిస్తున్నదని పేర్కొన్నారు.ఈ విత్తనం ద్వారా అధిక దిగుబడులు సాధించిన ఆదర్శ రైతులను ఈ సందర్భంగా సత్కరించారు...
అనంతరం ఆళ్లగడ్డ పట్టణంలోని అన్నదాత సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అధినేత హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ, నాణ్యమైన ‘ఎన్‌కే 6802’ విత్తనాలు తమ దుకాణంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఈ వర్షాకాలంలో ఈ విత్తనాన్ని వినియోగించి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. విత్తనాల కోసం 9866008198 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సింజెంటా సౌత్ ఇండియా డివిజన్ మేనేజర్ జయ్ దీప్ దాస్, సౌత్ ఇండియా మార్కెటింగ్ లీడ్ మహేష్ టెస్సా, అగ్రి కంటెంట్ లీడ్ తిరుమలయ్య, కర్నూలు టెర్రిటరీ మేనేజర్ భరత్ చంద్ర, గుంటూరు టెర్రిటరీ మేనేజర్ సూర్య ప్రభాకర్‌తో పాటు సింజెంటా సిబ్బంది, రైతులు పాల్గొన్నారు....
Please subscribe B10news👈👈👈👈👈👈
Tags:
జాతీయం



Comments